Telugu News » TS RTC: ఒప్పందాలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు: టీఎస్ ఆర్టీసీ

TS RTC: ఒప్పందాలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు: టీఎస్ ఆర్టీసీ

ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ ఆర్టీసీ(TS RTC) యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది.

by Mano
TS RTC: No breach of contract: TS RTC

ఉద్దేశపూర్వకంగా లైసెన్స్ ఫీజులను ఎగవేసే సంస్థలపై నిబంధనల మేరకు టీఎస్ ఆర్టీసీ(TS RTC) యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. బకాయిలు చెల్లించకుండా మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది. తమ బస్సుల్లో ప్రకటనల ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూ.21.73 కోట్లను మోసం చేసిన కేసులో ‘గో రూరల్ ఇండియా’(GO Rural India) సంస్థ నిర్వాహకుడు వి.సునీల్ అరెస్ట్ కావాడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది.

TS RTC: No breach of contract: TS RTC

హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం ‘గో రూరల్ ఇండియా’ అనే యాడ్ ఏజెన్సీ 2015 సెప్టెంబర్‌లో టీఎస్ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు సంవత్సరాలకు గాను 2021 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజును ఆ సంస్థ చెల్లించలేదు.

టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ బకాయిలపై సమీక్ష జరిపారు. సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రీజియన్ లో రూ.10.75 కోట్లు, సికింద్రాబాద్ రీజియన్ లో రూ.10.98 కోట్లు బకాయిలున్నాయి. తాజాగా సజ్జనార్ ఆదేశాల నేపథ్యంలో గో రూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీకి పలుమార్లు లీగల్ నోటీసులను సంస్థ జారీ చేసింది.

ఆ నోటీసులకు స్పందించిన యాడ్ ఏజెన్సీ రూ.55లక్షలు చెక్కురూపంలో ఇవ్వగా అవి చెల్లలేదు. ఈ మోసంపై అప్జల్ గంజ్, మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా టీఎస్ ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ అయింది. విచారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు ‘గో రూరల్ ఇండియా’ సంస్థ నిర్వాహకుడు వి.సునీల్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

You may also like

Leave a Comment