Telugu News » TSPSC Group-1: గ్రూప్-1 పోస్టులకు లైన్ క్లియర్.. త్వరలోనే నోటిఫికేషన్..!

TSPSC Group-1: గ్రూప్-1 పోస్టులకు లైన్ క్లియర్.. త్వరలోనే నోటిఫికేషన్..!

గ్రూప్ 1 నోటిఫికేషన్(Group-1 Notification) విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. 503 గ్రూప్ -1 నోటిఫికేషన్‌తో పాటు మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది.

by Mano
TSPSC Group-1: Line Cleared for Group-1 Posts.. Soon Notification..!

గ్రూప్ 1 నోటిఫికేషన్(Group-1 Notification) విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. గతేడాది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ(TSPSC) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇప్పుడు మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పడిన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

TSPSC Group-1: Line Cleared for Group-1 Posts.. Soon Notification..!

ఈ మేరకు తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదలైన 503 గ్రూప్ -1 నోటిఫికేషన్‌తో పాటు మరో 60 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది.

గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులతో పాటు ఈ 60 పోస్టులను కలిపి వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్ పీఎస్సీని ప్రభుత్వం ఆదేశించింది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది జూన్ 11న టీఎస్ పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండేళ్ల కిందటే తొలిసారిగా అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించారు.

అనంతరం ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ గతేడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా వారిలో 25 వేల మందిని 1:50 నిష్పత్తిలో టీఎస్పీఎస్సీ ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఉపసంహరించుకుంటున్నట్లు కమిషన్ తాజాగా దావా వేసింది. దీంతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ విడుదలై.. పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment