రాష్ట్రంలో ఆర్టీసీ(RTC) డ్రైవర్లు, కండక్టర్లపై ఇటీవల తరచూ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఆర్టీసీ బస్సు ఓ బైక్‌ను ఢీకొనడంతో వాహనదారులు ఏకంగా డ్రైవర్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) హెచ్చరించారు. అయితే, మరోసారి అలాంటి ఘటనే పునరావృతమైంది.
హయత్‌నగర్ డిపో-1(Hayatnagar Depot-1)కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు దుర్భషలాడుతూ దాడికి దిగింది. అసలేం జరిగిందంటే.. హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన మహిళ చిల్లర విషయంలో ఆర్టీసీ కండక్టర్లతో గొడవకు దిగింది. బస్సు మొదటి ట్రిప్పు వెళ్తుందని, తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ ఆ మహిళాతో ఎంత చెప్పినా వినిపించుకోకుండా దాడి చేసింది. అంతే కాదు దుర్భాషలాడుతూ కండక్టర్‌ను కాలితో తన్నింది.
‘నేను మర్డర్లు చేస్తా.. నిన్ను చంపేస్తా..’ అంటూ బెదిరింపులకు దిగింది. ఇక ఆమెను నిలువరించేందుకు మరో మహిళా కండక్టర్ ప్రయత్నించగా ఆమె పట్ల మహిళా ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందంటూ ట్వీట్ చేశారు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సదరు యువతిపై ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024