విద్యాసంస్థలకు వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. తెలుగు వారికి పుణ్యక్షేత్రాలంటే గుర్తుకు వచ్చేది తిరుపతి(Tirupati), శ్రీశైలం(Srishailam). అయితే ఈ సమ్మర్(Summer)లో మామూలు బస్సుల్లో ప్రయాణించాలంటే ఎండలకు ఊపిరాడదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు(Temperature) 40డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి.
ఏపీ(AP)లో అయితే మరింత ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఎండలకు తట్టుకుని ఆవేడికి నార్మల్ బస్సులో ప్రయాణం అంటే నిప్పులమీద కూర్చొని వెళుతున్నట్లు అనిపిస్తుంది. వృద్ధులు, పిల్లలు అయితే మామూలు బస్సుల్లో ప్రయాణం అంటే ఇబ్బందులు పడకతప్పదు. అసలు విషయానికి వస్తే మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ(TS RTC) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.
శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపేందుకు సిద్ధమైంది. అదేవిధంగా ప్రత్యేక బస్సు చార్జీలునూ నిర్ణయించింది. ఏసీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి శ్రీశైలంకి రూ.524గా ఛార్జీ నిర్ణయించారు. బీహెచ్ఎల్ నుంచి కూడా ఈ ఏసీ బస్సులు నడవనున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే అక్కడి నుంచి రూ.564టికెట్ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది.
అంతేకాకుండా అత్యాధునిక సౌకర్యాలతో, ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థ తయారు చేయించింది. రిజర్వేషన్ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతీ గంటకోసారి ఏసీ బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏసీ బస్సులు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వేసవి దృష్ట్యా ఏసీ బస్సుల సంఖ్యను పెంచినట్లు ఆర్టీసీ పేర్కొంది.