Telugu News » TSRTC: టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు.. పండుగ వేళ భారీ కలెక్షన్లు..!

TSRTC: టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు.. పండుగ వేళ భారీ కలెక్షన్లు..!

ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈసారి ఆర్టీసీకి భారీ స్పందన లభించింది. శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారు. ఈ విషయాన్ని వైద్య ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) తన ఎక్స్‌(x) ఖాతాలో తెలిపారు.

by Mano
TSRTC: TSRTC new record.. huge collections during festival..!

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ(TS RTC)  సరికొత్త రికార్డును నెలకొల్పింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా ఈసారి ఆర్టీసీకి భారీ స్పందన లభించింది. ఈ విషయాన్ని వైద్య ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) తన ఎక్స్‌(x) ఖాతాలో తెలిపారు.

TSRTC: TSRTC new record.. huge collections during festival..!

గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న(ఆదివారం) ఒక్క రోజే 1861 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు సంస్థ నడిపింది. అందులో 1127 హైదరాబాద్ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో నడిపారు. సంక్రాంతి సందర్భంగా రద్దీ ఎక్కవగా ఉండడంతో 4484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించారు.

అయితే, ఈ నెల 11, 12, 13 తేదీల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడిపారు. శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడిపారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను నడిపాల్సి ఉండగా మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పింది. శనివారం ఒక్క రోజులోనే 52.78 లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు సిబ్బంది చేర్చారు. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు.

మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని మహిళలు ఉచితంగా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చింది. తొలిసారిగా బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని, టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

You may also like

Leave a Comment