తుక్కుగూడ జనజాతర పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోంది. శనివారం నిర్వహించే ఈ సభకు సుమారు 10 లక్షల మంది జనం హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. సభా ప్రాంగణం ముందు వరుసలో సుమారు లక్ష మంది మహిళలను చోటు కల్పించాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే, కాంగ్రెస్(Congress) తుక్కుగూడ సభ నిర్వహిస్తుండగా రేపు జరగబోయే పరిణామాలను ముందే ఊహించుకుని కేసీఆర్‌కు టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రేపటి సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. సెంట్రల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను సైతం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని తెలుస్తోంది. తుక్కుగూడ సభలో భారీగా చేరికలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. కారు పార్టీ నుంచి నలుగురు సిట్టింగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.అయితే, వారు ఎవరనేది కేసీఆర్కు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది.
గతంలో అధికారంలో ఉన్న టైంలో నేతల ఫోన్ కాల్స్ గుట్టుగా విని వారిని పార్టీలు మారకుండా నిలువరించారు. కానీ ఇపుడు పార్టీ వీడకుండా వారిని ఎలా నిలువరిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ ముఖ్యనేతలు కొందరు ఇప్పటికే లీకులు ఇవ్వగా..10 వరకు చేరే అవకాశం ఉందని గాంధీ భవన్ నుంచి లీకులు వస్తున్నాయి.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేకే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కీలకనేతలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించే బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి కేకే మీద పెట్టినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కేకేతో కారు పార్టీకి చెందని ఓ మాజీ మంత్రి టచ్‌లో ఉన్నట్లు వినికిడి.