హైదరాబాద్ (Hyderabad) లో దారుణం చోటు చేసుకుంది. హోం వర్క్ (Home Work) చేయలేదని యూకేజీ (UKG) విద్యార్థిని టీచర్ పలకతో కొట్టింది. దీంతో విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృత దేహంతో అతని తల్లి దండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే… రామంత్ పూర్ వివేక్ నగర్ లోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు.
హేమంత్ శనివారం హోం వర్క్ చేయలేదని టీచర్ గుర్తించింది. దీంతో కోపంతో హేమంత్ తలపై పలకతో కొట్టింది. దీంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం హేమంత్ ను సమీపంలోని ఆస్పత్రికి రతలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో హేమంత్ మృత దేహంతో అతని తల్ది దండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన పాఠశాల యాజమాన్యం వారికి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో ఆందోళన వాళ్లు ఆందోళన విరమించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వనపర్తికి తరలించారు. అయితే గత కొంత కాలంగా హేమంత్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ సూపర్ మార్కెట్ ఫ్రిజ్ డోర్ తీసేందుకు వెళ్లి చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం….. నందిపేటకు చెందిన రాజశేఖర్, సంయుక్తలకు రిషిత రెండో సంతానం. పూజా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ కుటుంబం తన బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ పూజా సామాను తెచ్చేందుకు రిషిత తన తండ్రితో కలిసి వెళ్లింది.
సూపర్ మార్కెట్‌లో పాపకు ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని చెప్పి ఫ్రిజ్ వద్దకు రాజశేఖర్ వెళ్లాడు. దీంతో పాప కూడా అతని వెంట వెళ్లింది. ఆ సమయంలో పక్కనే ఉన్న మరో ఫ్రిజ్ ను పాప ముట్టుకుంది. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని రిషిత కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు.