Telugu News » MLC KAVITHA : లిక్కర్ స్కాం కేసులో కవితకు ఊహించని షాక్ ..14 రోజుల పాటు రిమాండ్!

MLC KAVITHA : లిక్కర్ స్కాం కేసులో కవితకు ఊహించని షాక్ ..14 రోజుల పాటు రిమాండ్!

ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor scam) కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు(Mlc Kavita) రౌస్ అవెన్యూ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మంగళవారంతో ఆమె ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయగా ముందుగా న్యాయమూర్తి భవేజా తీర్పును రిజర్వ్ చేశారు.

by Sai
CBI has stepped in..Kavitha's emergency petition in the special court!

ఢిల్లీ లిక్కర్ స్కాం(Liquor scam) కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు(Mlc Kavita) రౌస్ అవెన్యూ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మంగళవారంతో ఆమె ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేయగా ముందుగా న్యాయమూర్తి భవేజా తీర్పును రిజర్వ్ చేశారు.

Unexpected shock for Kavitha in liquor scam case ..remanded for 14 days!

Community-verified icon

ఈ క్రమంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై సమాధానం చెప్పేందుకు తమకు కాస్త సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించగా.. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కవితకు 14 రోజుల రిమాండ్(14days Remond) విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది.

దీంతో కవితను పోలీసు అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కవిత వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌లో తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరగా న్యాయస్థానం ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదని తెలుస్తోంది.

కవిత బయట ఉంటే సాక్ష్యులను ఇన్‌ ఫ్లూయెన్స్ చేసే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా కవిత కోర్టుకు హాజరయ్యే ముందు తనపై ఫాల్స్ కేసు పెట్టారని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, తాను కేసులకు భయపడే దానని కాదన్నారు.తప్పుడు కేసులో అరెస్టు అయినా ఎప్పటికీ అప్రూవర్ గా మారను అని స్పష్టంచేశారు.

You may also like

Leave a Comment