కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) హైదరాబాద్(hyderabad)కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్ ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆయన జూబ్లీహిల్స్ సీఆర్ఫీఎఫ్ సెక్టార్ గెస్ట్ హౌస్ కు అమిత్ షా చేరుకున్నారు.
తెలంగాణలో పలువురు బీజేపీ ముఖ్యనేతను అమిత్ షా పిలిపించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ చీప్ బండి సంజయ్, ఈటల రాజేందర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ తదితరులతో అమిత్ షా భేటీ కానున్నట్ట సమాచారం. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వారితో షా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
అతి కొద్ది మంది నేతలను మాత్రమే అమిత్ షా పిలిపించుకుంటున్నట్టు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలు ఏయే నేతలను అమిత్ షా పిలిచారని బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. తమను ఎందుకు పిలవలేదని మరి కొందరు నేతలు వాపోతున్నారు. వారితో షా ఏం చర్చిస్తారని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
ఇది ఇలా వుంటే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో షా భేటీ కానున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో ఆయన రేపు పాల్గొననున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.