2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ(BJP) పార్టీ ప్రచారంలో(Election compaign) అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు దశల్లో పలు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇంకా ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.
ప్రధాని నరేంద్రమోడీ(Pm MODI), కేంద్రహోంమంత్రి అమిత్ షా(AMiTH SHA), రక్షణ మంత్రి రాజ్నాథ్లు దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుండగా..వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Central minister Smriti Irani) కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. ఎవరూ ఊహించని విధంగా ఆదివారం రాత్రి స్కూటీ మీద ఎక్కి రైడ్ చేశారు.
స్కూటర్ మీద తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హెల్మెట్ ధరించిన ఆమె స్కూటర్ మీద యూపీలోని తన సొంత నియోజకవర్గం అమేథిలో రయ్యు రయ్యు మంటూ దూసుకెళ్లారు. కేంద్రమంత్రిని గుర్తించిన పలువురు స్థానిక ప్రజలు, యువత ఆమె వెంట చేరారు. అనంతరం పలువురు కేంద్రమంత్రితో సెల్ఫీలు తీసుకున్నారు.
#WATCH | Uttar Pradesh: Union Minister and BJP candidate from Amethi, Smriti Irani rides a scooter and meets people in Amethi, as she participates in an election campaign. pic.twitter.com/cClvzgd5ho
— ANI (@ANI) April 28, 2024
ఇదిలాఉండగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సృతి ఇరానీ అమేథి నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. ఈసారి కూడా రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించినా రాహుల్..తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచే పోటీకి సై అయ్యారు.
కాగా, కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో ఈసారి కూడా బీజేపీ నుంచి సృతి ఇరానీ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ నేటికి అభ్కర్థిని ప్రకటించలేదు. ఈ స్థానంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నా.. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.