Telugu News » Israel Strikes: ఫలించని చర్చలు.. గాజాలోని రఫాపై వైమానిక దాడి..!

Israel Strikes: ఫలించని చర్చలు.. గాజాలోని రఫాపై వైమానిక దాడి..!

గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) దాడులను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై వైమానిక దాడి చేసింది. దీంతో 13మంది మృతిచెందారు. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి.

by Mano
Israel Strikes: fruitless negotiations.. Air attack on Rafah in Gaza..!

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చించడానికి ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) దాడులను ఏమాత్రం ఆపడంలేదు. తాజాగా దక్షిణ గాజా నగరంలోని రఫాలో మూడు ఇళ్లపై వైమానిక దాడి చేసింది. దీంతో 13మంది మృతిచెందారు. మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి.

Israel Strikes: fruitless negotiations.. Air attack on Rafah in Gaza..!

హమాస్ మాత్రం 15 మంది మృతిచెందినట్లు మీడియాకు వెల్లడించింది. గాజా సిటీలోని ఇళ్లపై ఇజ్రాయెల్ విమానాలు దాడి చేశాయి. పాలస్తీనీయులు రఫాలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు పాల్పడింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లారు.

అనంతరం ప్రతీకారంగా హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇప్పటికే గాజా పట్టణం సర్వ నాశనమైంది. హమాస్ చెరలో ఇంకా ఇజ్రాయెలీయులు బందీలుగానే ఉన్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య విరమణ ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో మరోసారి దాడి జరగడంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గాజాలో మానవతా సాయం అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలో గాజాలో సాయం చేసేందుకు అమెరికాలో చర్యలో చేపట్టింది. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేయబోదని బైడెన్ హామీ ఇచ్చారు. ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో అందించిన ఆపన్నహస్తమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment