ఇండియా కూటమి (India Alliance)పై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిని చూసి తాము ఏ మాత్రం భయపడటం లేదని తెలిపారు. అసలు ఈ కూటమి తమకు పోటీయే కాదని చెప్పారు. ఇండియా కూటమి ఇప్పటి కన్వీనర్ కూడా నియమించులేకపోయిందని ఎద్దేవా చేశారు.
కూటమిలో ఇప్పటి వరకు పలువురు నేతల పేర్లను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించినప్పటికీ సీట్ల పంపంకంపై చర్చించలేకపోయారని అన్నారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…. ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై చర్చలు జరిగితే కొంత ఆశ ఉంటుందన్నారు.
కానీ కూటమిలో కన్వీనర్‌ను కూడా ఎంచుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా లేకపోయిందని చెప్పారు. ఆ కూటమిలో ప్రధాని పదవికి అరడజను మంది పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని దేశం 7.6 శాతం ఆర్థిక ప్రగతి సాధించిందని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్న మోడీ రెండుసార్లు మనదేశంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నేతలు న్యాయం గురించి మాట్లాడే ముందు 1984 అల్లర్ల బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.