Telugu News » Police Panchangam : పోలీస్ బ్రదర్స్ ఇక నుంచి పంచాంగాలు ఫాలో అవ్వండి…!?

Police Panchangam : పోలీస్ బ్రదర్స్ ఇక నుంచి పంచాంగాలు ఫాలో అవ్వండి…!?

పోలీసులంటేనే నమ్మకం,ధైర్యం,భరోసా,రక్షణ. అడపాదడపా అవినీతి పక్కనబెడితే..చాలా వరకూ పోలీసు వ్యవస్థ వల్లే సమాజం సజావుగా సాగుతోంది.

by sai krishna

పోలీసులంటేనే నమ్మకం,ధైర్యం,భరోసా,రక్షణ. అడపాదడపా అవినీతి పక్కనబెడితే..చాలా వరకూ పోలీసు వ్యవస్థ వల్లే సమాజం సజావుగా సాగుతోంది. సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు.

ఎక్కడ ఏ నేరం జరిగినా తన మేధస్సుతో,గుండె నిబ్బరంతో ఛేదించి నిజాన్ని నిగ్గుతేల్చి నేరస్తులను కటకటాల్లోకి నెట్టి సొసైటీకి శాంతిబధ్రతలు కల్పిస్తారు. వారు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మాయ మంత్రాలను, మూఢ నమ్మకాలను పట్టించుకోరు, ముహూర్తాలు చూడరు. వాస్తవానికి,యదార్ధానికి పెద్దపీట వేసే పోలీసులను పంచాగం తెచ్చుకోమంటూ ఆదేశాలు జారీచేశారు ఓ డీజీపీగారు.

పంచాంగం ప్రకారం అమావాస్య తేదీలు ఫాలో కావాల్సిందిగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) పోలీసులకు ఆయన సూచించారు. షాకయ్యారా నిజమండీ…! మరి ఆ డీజీపీగారు షురూ చేసిన ఈ పీకులాట పంచాంగం ఏంటో తెలుసుకుందాం.

అమావాస్యకు ముందు వారం, తరువాత వారం రోజుల్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రతినెల అమావాస్య వచ్చే తేదీలలో అదనపు అలర్ట్‌ గా ఉండాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపి సూచించారు.

ఇందులో భాగంగా ప్రతి నెల ఏ తేదీలలో అమావాస్య వస్తుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ పంచాంగం వెంట పెట్టుకోవాలని ఆదేశించారు.అమావాస్య రోజుల్లో సాధారణ రోజుల కంటే ఎక్కువ అలర్ట్ గా ఉండాలని తెలిపారు.


అమావాస్యకు ముందు వారం అమావాస్య ముగిసిన వారం రోజుల్లో విపరీతంగా క్రైమ్ పెరిగిందని అందుకు తగ్గట్టు ప్రతి ఒక్క పోలీస్ పంచంగాన్ని అనుసరించాలని డీజీపీ విజయ్ కుమార్(Vijay Kumar)తెలిపారు.

నేరం చేసేందుకు అమావాస్య రోజును క్రిమినల్స్(Criminals)ఎక్కువగా ఎంచుకుంటున్నారని డీజీపీ తెలిపారు. అందుకు తగ్గట్టుగానే తాము కూడా క్రిమినల్స్ రూట్లో ఆలోచించి అమావాస్య రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమావాస్యకు ముందు ఏడు రోజులు ఎక్కువ చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజులలో నేరాలు చేసేందుకు క్రిమినల్స్ ప్లాన్ చేసుకుంటారు. పంచాంగాన్ని తప్పనిసరిగా వాడాల్సిందిగా యూపీలోని అన్ని డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ల(District Police Stations)కు సర్కులర్ జారీ అయింది.

అమావాస్యకు, కృష్ణ పక్షానికి మధ్యలోనే ఎక్కువ నేరాలు జరుగుతున్నట్టు పోలీసులు అనాలసిస్ చేశారు. అమావాస్య రోజు పెట్రోలింగ్(Patrolling) పెంచడంతోపాటు ఎక్కువ నేరాలు జరుగుతున్న హాట్స్పాట్లను గుర్తించాల్సిందిగా అన్ని పోలీస్ స్టేషనులకు సర్కులర్ జారీ అయ్యింది.

You may also like

Leave a Comment