అమెరికా నావికాదళానికి చెందిన ఓ భారీ విమానం (US Navy plane) రన్‌వేపై (runway) అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్ కోర్ బేస్‌లో చోటు చేసుకుంది. సముద్రంలో బోటింగ్ చేస్తున్న వారు వెంటనే అప్రమత్తమై సాయం చేయడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.
అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ పొసెడాన్ విమానం సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రన్‌వేపై అదుపుతప్పి హవాయి సముద్రంలోకి దూసుకెళ్లింది. సముద్రంలో బోటింగ్ చేస్తున్న వారు విమానాన్ని చూసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. ఇక ప్రపంచంలో పీ8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే సహా భారత్ సైన్యం కూడా వాడుతోంది.
ఈ ప్రమాదానికి విజిబిలిటీ తక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సబ్మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదు. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. భారీగా ఇంటెలిజెన్స్‌నూ సేకరించగలదు.
🇺🇸 US Navy plane overshoots runway and ends up in a bay in Hawaii
The P-8A "Poseidon" overshot the runway at a Marine base on Kaneohe Bay, said U.S. Marine Corps Spox Gunnery Sgt. Orlando Perez said that all nine people on board the aircraft made it safely to shore@DlugajJuly pic.twitter.com/ltXxVgpvCU
— Velerie (@velerie_a) November 21, 2023