Telugu News » USA: 18మందిని హతమార్చిన నరహంతకుడు మృతి..!

USA: 18మందిని హతమార్చిన నరహంతకుడు మృతి..!

శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్ సెంటర్ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్ కార్డ్ గుర్తించారు.

by Mano
USA: The murderer who killed 18 people died..!

అమెరికా (USA)లోని మైన్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటన (Mass Shooting) నిందితుడు రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి ధ్రువీకరించారు. దీంతో రెండు రోజుల గాలింపు ఆపరేషన్‌ను పోలీసులు ముగించగా.. నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

USA: The murderer who killed 18 people died..!

అమెరికా కాలమానం ప్రకారం.. గత బుధవారం రాత్రి మైన్ రాష్ట్రంలోని లెవిస్టాన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఓ రెస్టారెంట్‌లో, ‘టెన్ పిన్ బౌలింగ్’ వేదిక వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్ గుర్తించారు. ఘటన తర్వాత రాబర్ట్ అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడి వద్ద ఆయుధం ఉండటంతో మళ్లీ కాల్పులకు తెగబడే అవకాశముందని పోలీసులు అనుమానించారు. లెవిన్‌ నుంచి లిస్బన్ వరకు ప్రజలు, వ్యాపారులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాల్పుల సమయంలో నిందితుడి ఫొటోను కూడా విడుదల చేశారు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లిస్బన్‌లో ఓ రీసైక్లింగ్ సెంటర్ సమీపంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్ కార్డ్ గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు ‌మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, రాబర్ట్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా షూట్ చేశారా? అనేదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

You may also like

Leave a Comment