Telugu News » USA: ఇరాన్‌తో వ్యాపారంపై అమెరికా ఆంక్షలు.. మూడు భారత్ కంపెనీలపై నిషేధం..!

USA: ఇరాన్‌తో వ్యాపారంపై అమెరికా ఆంక్షలు.. మూడు భారత్ కంపెనీలపై నిషేధం..!

ఇరాన్‌కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యా(Russia)కు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో అమెరికా పలు కంపెనీలపై ఆంక్షలు విధించింది.

by Mano
USA: US sanctions on business with Iran.. Ban on three Indian companies..!

ఇరాన్‌(Iran)తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా(USA) ఆంక్షలు విధించింది. కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై యూఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తోంది. ఇరాన్‌కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యా(Russia)కు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో అమెరికా పలు కంపెనీలపై ఆంక్షలు విధించింది.

USA: US sanctions on business with Iran.. Ban on three Indian companies..!

గురువారం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో 12కు పైగా కంపెనీలపై నిషేధం విధించగా వాటిలో భారత్‌కు చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. భారత్‌కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్, పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీఆర్ట్ షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ వైమానిక వాహనాలను అందజేసిందని అమెరికా ఆరోపిస్తోంది.

రష్యాకు అక్రమంగా ఆయుధాలను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం ‘సహారా థండర్’ కీలక పాత్ర పోషించినట్లు అమెరికా పేర్కొంది. అదేవిధంగా ఉగ్రవాద గ్రూపులకు అండగా ఉంటున్న ఇరాన్‌పై యూఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇరాన్‌కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను చైనా, రష్యా, వెనిజులా సహా పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరపడానికి సిద్ధమయ్యాయి.

దీనికి భారీ షిప్పింగ్ నెట్ వర్క్‌పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి రహస్య విక్రయాలను ఈజీ చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించడంలో ఈ కంపెనీలు, వ్యక్తులు, నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాగం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. కాగా, ఉక్రెయిన్‌లో తమ యుద్ధ అవసరాల కోసం ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుంటుందని యూఎస్ ఆరోపించింది.

You may also like

Leave a Comment