Telugu News » Uttam Kumar Reddy: ‘అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు’.. ఉత్తమ్ అసహనం..!

Uttam Kumar Reddy: ‘అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు’.. ఉత్తమ్ అసహనం..!

ఓ సంస్థకు బాధ్యతలకు అప్పగించామని.. ఆ సంస్థ ప్రతినిధులు విధి నిర్వహణలో ఉండగా వారిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఉత్తమ్ ఆరోపణ. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

by Mano
Uttam Kumar Reddy: 'Police in favor of the ruling party'.. Uttam's impatience..!

తెలంగాణ ఎన్నికలు(Telangana Elections) రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు విమర్శ, ప్రతివిమర్శలతో చెడామడా తిట్టేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడంలేదు. మరోవైపు, అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణే తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy)చేశారు.

Uttam Kumar Reddy: 'Police in favor of the ruling party'.. Uttam's impatience..!

సూర్యాపేట జిల్లాలోరి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న కొందరిని కిడ్నాప్ చేశారని పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు ఓ సంస్థకు బాధ్యతలకు అప్పగించామని.. ఆ సంస్థ ప్రతినిధులు విధి నిర్వహణలో ఉండగా వారిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని ఉత్తమ్ ఆరోపణ. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదంటూ పోలీస్‌స్టేషన్ ఎదుటే నిరసనకు దిగారు.

వ్యవహారంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఇప్పటికే హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులకు శిక్షలు తప్పవంటూ ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment