Telugu News » CM Yogi Adityanath : యోగులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందా..!!

CM Yogi Adityanath : యోగులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందా..!!

కేంద్ర ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్ళిన యోగికి, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో (Pushkar Singh Dhami) పాటు ఇతర మంత్రులు స్వాగతం పలికారు.

by Venu

యోగులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రిని చూస్తే తెలుస్తోందని ప్రజలు అనుకుంటున్నారట. యూపీ ((UP) మినిష్టర్ గా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath). తన జీవన విధానం మిగతా రాజకీయ నాయకులకంటే భిన్నంగా ఉంటుంది కూడా..

రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా ఎప్పుడు సాదా సీదా మనిషిలా కనిపించడమే యోగి ప్రత్యేకత. ఇకపోతే ప్రస్తుతం ఆయన సొంత రాష్ట్రం అయినా ఉత్తరాఖండ్ (Uttarakhand) పర్యటనలో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్. కేంద్ర ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఉత్తరాఖండ్‌కు వెళ్ళిన యోగికి, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో (Pushkar Singh Dhami) పాటు ఇతర మంత్రులు స్వాగతం పలికారు.

తెల్లవారు జామున చార్ ధామ్ ఆలయాల సందర్శనను ప్రారంభించిన యోగి ఆదిత్యనాథ్.. బద్రినాథ్ (Badrinath) ధామ్ సమీపంలోని సుందర్ నాథ్ (Sundar Nath) కేవ్ ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఓ సాధారణ భక్తుడిలా కనిపించారు యోగి. ఆయన వెంట వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఇతర అధికారులు ఎవరూ లేరు.

అనంతరం బద్రినాథ్ ధామ్‌లో స్థానికులతో కాసేపు ముచ్చటించారు. బద్రీనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన యోగి ఆదిత్యనాథ్ ఆలయంలో నిర్వహించిన శయన హారతిలో పాల్గొన్నారు. ఇక భారత్ చిట్టచివరి గ్రామం అయినా మానాను కూడా సందర్శించారు. ఘస్తౌలీ పోస్ట్‌కు వెళ్ళి విధి నిర్వహణలో ఉన్న ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ సిబ్బందిని పలకరించారు. సమీపంలో గల అలకనంద నదిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బద్రినాథ్ ధామ్‌లో బస చేశారు యోగి ఆదిత్యనాథ్.

You may also like

Leave a Comment