Telugu News » Uttar Pradesh : శ్రీరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయండి.. వైద్యులను కోరుతోన్న గర్భిణీలు..!!

Uttar Pradesh : శ్రీరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ రోజే డెలివరీ చేయండి.. వైద్యులను కోరుతోన్న గర్భిణీలు..!!

జనవరి 22వ తేదీ దేశానికి చరిత్రాత్మక రోజు కాబోతోంది. అలాంటి రోజున ఇంట్లో రాముడి రూపంలో బిడ్డ పుట్టాలని ఇక్కడ ఉన్న చాలా కుటుంబాలు కోరుకొంటున్నట్టు తెలుస్తుంది. అందుకే గర్భిణీ గా ఉన్న వారు ఎలాగైనా జనవరి 22న ప్రసవం జరగాలని కోరుకొంటున్నారు..

by Venu
After Supreme Court verdict on Ayodhya land

అయోధ్య (Ayodhya)లో ఈ నెల 22న జరిగే శ్రీరాముడి (Sri Ram) విగ్రహా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ క్రమంలో అందమైన అలంకరణతో అయోధ్య ముస్తాబవుతున్నది. ప్రతి వీధిలో రాముడి జీవిత చరిత్రకు సంబంధించిన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. రామ మందిరం పరిసరాలను లైట్లు, పూలతో డెకరేషన్ చేశారు.

After Supreme Court verdict on Ayodhya land

అయితే ఇదే సమయంలో ఉత్తర్​ప్రదేశ్​ (Uttar Pradesh)లో చాలా మంది గర్భిణులు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజునే తమకు ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారు. ఆ చరిత్రాత్మక రోజును తమ జీవితంలో చిరస్మరణీయంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. ఆ రోజున పిల్లలు పుడితే తమ ఇళ్లలో రామ్‌లల్లాకి పునర్జన్మ లభించినంత పుణ్యంగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు..

ఈ క్రమంలో కాన్పుర్​ (Kanpur)కు చెందిన ఓ గర్భిణీ (pregnant) జనవరి 22న తనకు ప్రసవం చేయాలని వైద్యులను కోరింది. శ్రీరాముడి తల్లి కౌసల్యను స్మరించుకుని తన ఇంట్లో శ్రీరాముడు పుట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆమె మాటలు విన్న ఆ వైద్యురాలు ఆశ్చర్యానికి గురైరయ్యారు. ఆ రోజు ఆరోగ్యంగా, ఫిట్​గా ఉన్న మహిళలందరికీ ఆపరేషన్ చేసేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం..

మరోవైపు జనవరి 22వ తేదీ దేశానికి చరిత్రాత్మక రోజు కాబోతోంది. అలాంటి రోజున ఇంట్లో రాముడి రూపంలో బిడ్డ పుట్టాలని ఇక్కడ ఉన్న చాలా కుటుంబాలు కోరుకొంటున్నట్టు తెలుస్తుంది. అందుకే గర్భిణీ గా ఉన్న వారు ఎలాగైనా జనవరి 22న ప్రసవం జరగాలని కోరుకొంటున్నారు.. ఇందులో భాగంగా ఇప్పటికే వైద్యులను సంప్రదించి వారిచ్చిన సూచనలను పాటిస్తూ.. ప్రసవానికి సిద్దం అవుతోన్నట్టు సమాచారం.

You may also like

Leave a Comment