Telugu News » Uttar Pradesh : డ్యామేజ్ లో ఇండియా కూటమి.. కాంగ్రెస్-ఎస్పీ మధ్య విఫలమైన చర్చలు..!

Uttar Pradesh : డ్యామేజ్ లో ఇండియా కూటమి.. కాంగ్రెస్-ఎస్పీ మధ్య విఫలమైన చర్చలు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టు కోసం తంటాలు ప‌డుతున్న కాంగ్రెస్‌ (Congress)కు స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. 80 లోక్‌స‌భ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్‌కు 17 సీట్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

by Venu

బీజేపీ (BJP) ఓటమి లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ప్రస్తుతం డ్యామేజ్ స్థితిలో ఉన్నదని తెలుస్తోంది. ఇప్పట్లో కొలుకునేలా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ స్థానాల పరంగా పశ్చిమ బెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) తర్వాత దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ప్రతిపక్ష కూటమికి షాక్ తగిలింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టు కోసం తంటాలు ప‌డుతున్న కాంగ్రెస్‌ (Congress)కు స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. 80 లోక్‌స‌భ స్థానాలున్న యూపీలో కాంగ్రెస్‌కు 17 సీట్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దానికి ఓకే అంటేనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో క‌లిసి త‌మ రాష్ట్రంలో భార‌త్ న్యాయ్ యాత్ర‌లో పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు. మరోవైపు నిన్న జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి.

మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు ఉండదని సన్నిహిత వర్గాలు అప్పుడే ప్రచారం మొదలుపెట్టాయి. అయితే ఈ విషయాన్ని రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ యూపీలో ఘోర ప‌రాభవం ఎదుర్కొంది. 80 స్థానాల‌కు గాను ఒక్క‌చోట మాత్ర‌మే గెలిచింది.

అది కూడా సోనియా నిల‌బ‌డిన రాయ్‌బ‌రేలిలో మాత్ర‌మే. రాహుల్ గాంధీ స‌హా మ‌హామహులంతా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎస్పీ, బీఎస్పీల‌తో క‌లిసి ఎన్నిక‌లకు వెళ్లాల‌న్న కాంగ్రెస్ ఆశ‌లు అడియాసలుగా మారేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే పొత్తులో భాగంగా రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్‌పీ నిన్న ప్రతిపాదన చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం కనీసం 20 సీట్లు కావాలని పట్టుబట్టింది.

You may also like

Leave a Comment