భారతీయ రైల్వే(Indian railway) ప్రవేశపెట్టిన అత్యాధునిక రైల్వే సర్వీస్ వందేభారత్(vande bharat). కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ రైల్ సేవలను దేశవ్యాప్తంగా విస్తృతం చేసే యోజనలో ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 24రాష్ట్రాల్లో కొత్త రూట్లతో కలిసి సుమారు 75 వందే భారత్ ఎక్స్‌ప్రెస్(vande bharath express) రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
వందేభారత్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో రైలుపై ఆసక్తి పెరిగింది. దీనికి కారణం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వేగం. కేవలం గంటల వ్యవధిలోనే వందల కిలోమీటర్లు ప్రయాణించగల కెపాసిటీ వందేభారత్‌కు ఉంది. దీంతో విమానాల్లో వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఓ నివేదిక వెల్లడించింది.
చెన్నై-బెంగళూరు, తిరువనంతపురం-కాసరగోడ్, ముంబై-పూణె, జామ్ నగర్-అహ్మదాబాద్, ఢిల్లీ-జైపూర్ మార్గాలను ఉదాహరణగా ఆ నివేదిక పేర్కొంది. ఏప్రిల్ 2023తో పోలిస్తే ఈ నగరాల మధ్య విమాన టికెట్ల ధరలు 20 నుంచి 30శాతం తగ్గినట్లు పేర్కొంది. వాస్తవానికి విమాన టికెట్ల రేట్లు డైనమిక్‌గా నిర్ణయిస్తారు. డైనమిక్ ప్రైసింగ్ అంటే ఏదైనా రూట్ టికెట్ల కోసం డిమాండ్ ఎంక్వైరీ పెరిగితే ఆ రూట్‌లో ఛార్జీలను ఆటోమెటిక్‌గా పెరుగుతుంది.
డిమాండ్ లేదా ఎంక్వైరీ తగ్గినప్పుడు ఛార్జీలు తగ్గుతాయి. ప్రస్తుత అధ్యయనంలో ఛార్జీలు తగ్గినట్లు చెప్పిన అన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఆయా మార్గాల్లో రూ.2000 పెట్టి నాలుగు గంటలు విమానంలో ప్రయాణం చేసే బదులు రూ.400లకు ఐదు గంటలు ప్రయాణం చేయడం బెటర్ అనుకుంటున్నారు ప్రయాణికులు.