Telugu News » Vellampalli Srinivasa Rao: యువతను ప్రోత్సహించేందుకే ‘ఆడుదాం.. ఆంధ్రా’: ఎమ్మెల్యే వెల్లంపల్లి

Vellampalli Srinivasa Rao: యువతను ప్రోత్సహించేందుకే ‘ఆడుదాం.. ఆంధ్రా’: ఎమ్మెల్యే వెల్లంపల్లి

వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) వెల్లంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasa Rao) అన్నారు. ‘ఆడుదాం.. ఆంధ్రా’(Aadudam Andhra) కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా(NTR District) వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

by Mano
Vellampalli Srinivasa Rao: 'Let's play...Andhra' to encourage youth: MLA Vellampalli

ఏపీ(AP)లో సీఎం జగన్ క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) వెల్లంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasa Rao) అన్నారు. ‘ఆడుదాం.. ఆంధ్రా’(Aadudam Andhra) కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా(NTR District) వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Vellampalli Srinivasa Rao: 'Let's play...Andhra' to encourage youth: MLA Vellampalli

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆడుదాం.. ఆంధ్రా’ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందన్నారు. విజయవాడ పరిధిలో 33 వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీమ్లు ఎంపికయ్యాయని చెప్పారు. ఇక, డిసెంబర్ 26 నుంచి 45 రోజులు పాటు ఆడుదాం ఆంధ్రా సాగుతుందని వెల్లడించారు.

ఇందులో క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ , ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే యువకులకు ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

అదేవిధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ఆడుదాం- ఆంధ్రా’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. 64 డివిజన్లలోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రకటించారు. క్రీడాకారుల టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఇదొక చక్కని వేదిక అని తెలిపారు. మరోవైపు.. క్రీడల్లో అవకాశం దక్కని ఎందరికో అవకాశం లభిస్తోందని తెలిపారు. జాతీయ స్థాయిలో తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు ఇదొక అవకాశన్నారు.

క్రీడాకారులకు కిట్లు కూడా అందజేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment