రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు (Harish Rao) సీఎం కావాలనే ప్లాన్‌లో ఉన్నాడని ఆరోపించారు. అందుకు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, కేసిఆర్‌ను వ్యతిరేకించి వస్తే సపోర్ట్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. టీఆర్ఎస్లో నాలుగు పార్టీలు అవుతాయని చెప్పారు. హరీష్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కాగా, హరీశ్‌రావు 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని సూచించారు.
కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు… ఆయన పులి ఎట్లా అవుతాడు? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే… 86 కిలోలు ఉన్న నేనేం కావాలి అని సెటైర్లు వేశారు. మరోవైపు గాంధీ కుటుంభం దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిందని వెంకట్ రెడ్డి తెలిపారు. అందుకే వారి విగ్రహాలు పెడుతున్నామని చెప్పారు.
గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తున్నామని ప్రకటించారు. రెండు రోజుల్లో గద్దర్ అవార్డు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని చూస్తే గ్రామీణ వాతావరణం ఉట్టి పడాలన్నారు. చాకలి ఐలమ్మ గుర్తుకు రావాలని తెలిపారు. అందుకే రాష్ట్ర రూపురేఖలు మార్చాలని చూస్తున్నామని వెంకట్ రెడ్డి తెలిపారు.