తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిపోయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది ఎన్నికల్లో కొందరికి ఊహించని విజయం లభిస్తే కొంత మందికి అనుకోని ఓటమి ఎదురయింది. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి తాటిపల్లి వెంకటరమణారెడ్డి అయితే ఆల్ టైం రికార్డ్ గా నిలిచారు. సీఎం కేసీఆర్ ని కాబోయే సీఎం రేవంత్ రెడ్డిని కలిపి ఆయన ఓడించారు. ప్రస్తుతం ఇది సంచలనంగా నిలుస్తోంది. తెలంగాణ ఎన్నికలు అంతా ఒక ఎత్తు అయితే కామారెడ్డి ఎన్నికలు మాత్రం మరొక ఎత్తు అన్న విధంగా ఇక్కడ చోటుచేసుకుంది.
ఈ నియోజకవర్గము నుండి కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇక్కడి నుండి నామినేషన్ వేయడం జరిగింది. దీనివలన కామారెడ్డిలో ఎన్నికలకి స్పెషల్ డిస్కషన్ మొదలైంది కేసీఆర్ రేవంత్ రెడ్డిలలో ఎవరు గెలుస్తారు అన్న చర్చ కూడా జోరుగా సాగింది బిజెపి నేత వెంకటరమణారెడ్డి ఇద్దరినీ ఓడిస్తాను అని ముందు నుండి చెప్తూ వచ్చారు. ఎవరు ఆయన మాట వినలేదు.
Also read:
బహిరంగ చర్చలలో కూడా ఎక్కడ ఆయన గురించి చర్చ జరగలేదు ఎన్నికల ఫలితాలు లో మాత్రం ట్విస్ట్ ఎదురయింది. ఊహించని విధంగా వెంకటరమణారెడ్డి విజయాన్ని అందుకున్నారు. కౌంటింగ్ టైంలో ఎక్కువ ఓట్లు రేవంత్ రెడ్డికి వస్తాయి అని అనిపించినా 12 రౌండ్ల తర్వాత అనుకోకుండా 13వ రౌండ్ వచ్చేసరికి వెంకటరమణారెడ్డి ఆదిత్యంలోకి వచ్చారు ఇలా కేసీఆర్ రేవంత్ రెడ్డిని దాటుకుంటూ వెంకటరమణారెడ్డి గెలిచేసారు.