Telugu News » Amit shah : లోక్‌‌సభ ఎన్నికల వేళ అమిత్ షా ఫేక్ ప్రసంగం వీడియోలు.. కేసు నమోదు!

Amit shah : లోక్‌‌సభ ఎన్నికల వేళ అమిత్ షా ఫేక్ ప్రసంగం వీడియోలు.. కేసు నమోదు!

పార్లమెంట్ ఎన్నికల వేళ హోంమంత్రి అమిత్ షా (Central home minister Amith sha)కు సంబంధించిన ఫేక్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు.అమిత్ షా ఎన్నికల ప్రసంగానికి సంబంధించి ఫేక్ వీడియోలు(Fake Videos) వైరల్ అవ్వడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు (Delhi Police) కేసు నమోదు చేశారు.

by Sai
Videos of Amit Shah's fake speech during Lok Sabha elections.. Case registered!

అయితే, అమిత్ షా ఇటీవలే తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

అయితే, అమిత్ షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేంది.కాగా, తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజరేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేసింది. ఈ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన వీడియోలను వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యింది.

దీని వలన పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉన్నందున దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా సీరియస్ అయ్యింది. నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like

Leave a Comment