Telugu News » Varalaxmi Sarathkumar: నెగెటివ్ కామెంట్స్‌ పట్టించుకోను: విలన్ వరలక్ష్మి

Varalaxmi Sarathkumar: నెగెటివ్ కామెంట్స్‌ పట్టించుకోను: విలన్ వరలక్ష్మి

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపింది. తనకు కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌పై వచ్చిన విమర్శల పై స్పందించింది. నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనని తెలిపింది.

by Mano
Israel Strikes: fruitless negotiations.. Air attack on Rafah in Gaza..!

సినిమాల్లో విలన్ పాత్రలు మామూలుగా మగవారికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పటి వరకు అనేక సినిమాల్లో నెగెటివ్ పాత్రల్లో ఆడవారూ తాము నెగెటివ్ పాత్రలు చేయగలమని నిరూపించారు. పాత సినిమాల్లో అయితే సూర్యకాంతం నుంచి మొదలుకొని మొన్నటి తెలంగాణ శకుంతల వరకు వైవిద్య పాత్రల్లో నటించి మెప్పించారు.

Israel Strikes: fruitless negotiations.. Air attack on Rafah in Gaza..!

అలాంటి పాత్రలో ప్రస్తుతం వరుస సినిమాల్లో మెప్పిస్తున్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). నటుడు శరత్ కుమార్ కుమార్తెగా తెరంగేట్రం చేసిన ఆమె అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విలన్ పాత్రలతో ఆమెకు విలన్ వరలక్ష్మిగా నామకరణం చేశాయి సినీవర్గాలు. ‘క్రాక్’, ‘వీరసింహారెడ్డి’ వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో, రీసెంట్‌గా వచ్చిన ‘హనుమాన్’ (Hanuman) సినిమాలో హీరో అక్క పాత్రలో ఒదిగిపోయింది.

ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొత్త సినిమా ‘శబరి’ మే 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపింది. తనకు కాబోయే భర్త నికోలయ్ సచ్‌దేవ్‌పై వచ్చిన విమర్శల పై స్పందించింది. నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనని తెలిపింది. సెకండ్ మ్యారేజ్ అంటూ నిక్ గురించి కొందరు ఏం మాట్లాడుతున్నారో విన్నానని తెలుపుతూ.. తనకు మాత్రం ఆయన హ్యాండ్సమ్‌గా కనిపిస్తారని చెప్పుకొచ్చింది.

తన తండ్రి కూడా రెండు సార్లు పెళ్లి చేసుకున్నారని, ఆయన ఆనందంగా ఉన్నంత వరకు అందులో తప్పు లేదని అభిప్రాయపడింది. నిక్‌తో తన బంధంపై పలువురు చేస్తున్న ట్రోల్స్‌ను ఏమాత్రం లెక్కచేయనని తెలిపింది. అయినా తనెందుకు వారందరికీ సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. కాగా, ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌ ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. మార్చి తొలివారంలో వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని వరలక్ష్మి గత ఇంటర్వ్యూలో తెలిపింది.

You may also like

Leave a Comment