సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోలు, ప్రముఖ నటీనటులు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టాలీవుడ్లో స్టార్ నటుడు, రాజకీయ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ నటుడు(Tamil Star Actor), నటీనటుల సంఘం మాజీ అధ్యక్షుడు, డీఎంయూడీ(DMUD) వ్యవస్థాపకుడు విజయకాంత్(VijayaKant) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మాయత్ ఆసుపత్రిలో చేరారు. గతంలో పలుమార్లు ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
విజయకాంత్ కొంతకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే ఆయన మూడు వేళ్లను వైద్యులు తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం.
కొంతకాలంగా పార్టీ బాధ్యతలను కోశాధికారి అయిన ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ భుజాన వేసుకొని ముందుకుసాగుతున్నారు. విజయకాంత్‌కు గొంతునొప్పి, దగ్గు, జలుబు ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకుంటారని తెలిసింది.