Telugu News » ijayawada : దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

ijayawada : దసరాకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి

పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని.. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని తీసుకుంటామని తెలిపారు.

by Prasanna
vijayawada 1

దసరా (Dussrah) అనగానే విజయవాడ (Vijayawada) లో కొలువైన కనకదుర్గాదేవి ఆలయమూ (Durga Temple) వివిధ అలంకారాలలోని అమ్మ రూపూ గుర్తుకువస్తాయి. నవరాత్రి తొమ్మిది రోజూలూ రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

vijayawada 1

ఈ రోజుల్లో అమ్మవారిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడ చేరుకుంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారుల ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు చెప్పారు.

దసరా సందర్భంగా గతంలో ఇంజనీరింగ్ పనులకే సుమారు 2.5 కోట్లు ఖర్చు చేసామని తెలిపారు. పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని.. పది రోజులకు కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని తీసుకుంటామని తెలిపారు. కొండచరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఈవో భ్రమరాంబ తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని, ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయన్నారు. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయని.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనంపై స్లాట్లు కూడా నిర్ణయిస్తామన్నారు.

ఏ రోజు ఏ అలంకారమంటే…

అక్టోబర్ 15 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల తొలిరోజు శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
• 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం
• 17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
• 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
• 19న శ్రీ మహాచండీ దేవి అలంకారం
• 20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం). అదే రోజు సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
• 21న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం
• 22న శ్రీ దుర్గాదేవి అలంకారం
• 23న శ్రీ మహిషాసుర‌మర్ధనీ దేవి అలంకారం… మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

You may also like

Leave a Comment