కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ (Vijayakanth)కు కొవిడ్ పాజిటివ్(Covid Positive)వచ్చింది. ఈ విషయాన్ని డీఎండీకే(DMDK) పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్వాస సంబంధిత సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది.
విజయకాంత్ కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కొవిడ్ తోడవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్ ఫాన్స్, డీఎండీకే నేతలు ఆందోళన చెందుతున్నారు.
నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక డిసెంబర్ 11న ఆయన డిశ్చార్జి అయ్యారు. అనంతరం డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో విజయకాంత్ పాల్గొన్నారు.
సెప్టెంబర్ 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం చైన్నెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. అయితే మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. తాజాగా కొవిడ్ సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.