ప్రస్తుతం తెలంగాణలో ఏ ఘటన జరిగిన దానిని చేసిన వారు కాంగ్రెస్ కార్యకర్తలు అనే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో అచ్చంపేటలో, గువ్వల బాలరాజు ప్రారంభించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తి, ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar) స్పందించారు..
ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే (MLA) క్యాంప్ ఆఫీసుల (Camp Office)ను గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే అలాంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని వినోద్ కుమార్ కోరారు.. అచ్చంపేట నియోజకవర్గక క్యాంపు కార్యాలయంలోని శిలాఫలకాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించిన వినోద్ కుమార్.. అలా చేయడాన్ని తప్పు పట్టారు.
బీఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బోయినపల్లి వినోద్ కుమార్.. అధికారం ఎవరికి శాశ్వతం కాదని గుర్తుచేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదని విమర్శించారు.. బీఆర్‌ఎస్ ఏర్పడిందే తెలంగాణ (Telangana) కోసమని గుర్తు చేసిన వినోద్ కుమార్.. ప్రభుత్వాలు మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగించడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు..
రాష్ట్రంలో మంచి పనులు చేస్తే ప్రభుత్వాన్ని సమర్ధిస్తాం. చెడు చేస్తే విమర్శిస్తామని వినోద్ కుమార్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని మాజీ ఎంపీ కోరారు.