జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించింది ఆమె. అతి చిన్నవయసులోనే వివాహం కాగా, పెళ్లైన కొద్దిరోజులకే భర్తను కోల్పోయింది. ఉపాధ్యాయురాలిగా పనిచేసి నలుగురు కుమార్తెలను పెంచి పోషించింది. ఎన్నాళ్ల నుంచో ఆకాశంలో విహరించాలన్నది ఆమె కల. అయితే, ఆ కల 97ఏళ్ల వయసులో నెరవేరింది.
ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా బామ్మలు కూడా పెద్ద సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవల బామ్మల డ్యాన్స్ వీడియోలు వైరల్ అవ్వడం మనం చూశాం.. తాజాగా, మరో బామ్మ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఇది మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన ఉషా తుసే అనే 97ఏళ్ల బామ్మ పూణేలో పారా మోటరింగ్ అడ్వెంచర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా X (ట్విటర్) వేదికగా పంచుకోగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
‘మీరు గ్రేట్ బామ్మ.. అందరికీ ఆదర్శం కూడా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఆ వీడియోలో బామ్మ స్కై డ్రైవ్ చేస్తూ కనిపించింది. ‘చిన్ని చిన్ని ఆశ..’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
It’s NEVER too late to fly.
She’s my hero of the day… pic.twitter.com/qjskoIaUt3— anand mahindra (@anandmahindra) November 23, 2023