Telugu News » Virat Kohli: హ్యాపీ బర్త్‌డే క్రికెట్ కింగ్.. 35 ఏళ్లలో కోహ్లీ రికార్డులు ఇవే..!

Virat Kohli: హ్యాపీ బర్త్‌డే క్రికెట్ కింగ్.. 35 ఏళ్లలో కోహ్లీ రికార్డులు ఇవే..!

ఆ తెగింపే ఆయనను గొప్ప క్రికెటర్‌ను చేసింది. అతడే.. భారత క్రికెట్ జట్టు(Team india) వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli).. నేడు క్రికెట్ కింగ్ కోహ్లీ 36వ బర్త్‌డే.

by Mano
kohli

కఠోర శ్రమ, ధైర్యం ఆయనను క్రికెట్ ప్రపంచం(Cricket World)లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా నిలబెట్టాయి. తన కెరియర్‌ తొలి దశలో ఎన్నో పరాజయాలను చవిచూశాడు. అయినా అవేమీ లెక్కచేయలేదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అనుకున్నాడు. ఆ తెగింపే ఆయనను గొప్ప క్రికెటర్‌ను చేసింది. అతడే.. భారత క్రికెట్ జట్టు(Team india) వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli).. నేడు క్రికెట్ కింగ్ కోహ్లీ 36వ బర్త్‌డే.

kohli

విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న న్యూఢిల్లీలో తండ్రి ప్రేమ్ కోహ్లీ, తల్లి సరోజ్‌ కోహ్లీ దంపతులకు జన్మించాడు. కోహ్లీ తన తొలి రోజుల్లో కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద శిక్షణ పొందాడు. 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో తన సారథ్యంలో భారత్‌ను ప్రపంచకప్‌లో చేర్చాడు. ఆ వెంటనే కోహ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అలుపెరని పరుగులు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

కోహ్లికి 35 ఏళ్లు నిండాయి. తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాడు. మామూలుగా కోహ్లిని కింగ్ అని పిలవలేదు. ఇందుకోసం ఏళ్ల తరబడి అవిశ్రాంతంగా శ్రమించారు. కోహ్లీకి కోల్‌కత్తా మైదానంలో ఆడే మ్యాచ్‌కు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆ మైదానంలోనే విరాట్‌ అత్యధిక పరుగులు సాధించడమే అందుకు కారణం. ఆదివారం కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.

కోహ్లి రికార్డులను పరిశీలిస్తే ఏ ఆటగాడికి వాటిని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 100 సెంచరీలు సాధించాడు. కోహ్లీ 78 సెంచరీలు చేశాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అతడి రికార్డుకు దగ్గరగా ఎవరూ లేరు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్ 71 సెంచరీలు చేశాడు.

వన్డే ఫార్మాట్‌లో కింగ్ కోహ్లీ 48 సెంచరీలు సాధించాడు. కాగా, సచిన్ 49 సెంచరీలు సాధించాడు. కోహ్లి సెంచరీ సాధించిన వెంటనే వన్డేల్లో సచిన్‌ను సమం చేస్తాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే, అందులో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 514 మ్యాచ్ 26209 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని అత్యుత్తమ స్కోరు అజేయంగా 254 పరుగులు. ఈ లిస్ట్‌లోనూ సచిన్ నంబర్ వన్. అతను 34357 పరుగులు చేశాడు. కుమార సంగక్కర 28016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లి అంతర్జాతీయ మ్యాచ్ 136 హాఫ్ సెంచరీలు  ధించాడు.

 

You may also like

Leave a Comment