ఏపీ (AP) సీఎం జగన్ (CM Jagan)పై జరిగిన దాడి విషయంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే.. తాజాగా రాయి దాడిపై హీరో విశాల్ (Vishal) తనదైన శైలిలో స్పందించారు. ఈ దాడిలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. కావాలనే ఆయనపై దాడి చేసినట్టు ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు.. గతంలో సైతం ఆయనపై కోడి కత్తితో దాడి చేశారని గుర్తు చేశారు.

అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానని తెలిపిన తమిళ స్టార్.. తన రాజకీయ ఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. తాను ఇంకా రాజకీయాల్లోకి రావడానికి సమయం ఉందని పేర్కొన్నారు.. ఇక గతంలో విశాల్, ఏపీ ఎలక్షన్స్‌లోనూ పోటీ చేయబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఏపీ పాలిటిక్స్‌లోకి మాత్రం రావడం లేదన్నారు..