అమెరికా అధ్యక్ష అభ్యర్థి (US President Elections) కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహిస్తున్న చర్చల్లో భారతీయ మూలాలు ఉన్న వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) దూసుకుపోతున్నారు. నాలుగవ రిపబ్లికన్ డిబేట్(Republic Debate)లో నలుగురు పోటీపడ్డారు.
ఈ పోటీలో వివేక్ రామస్వామితో పాటు కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హలే, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్, మాజీ న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీలు చర్చలో పాల్గొన్నారు. డిబేట్‌లో రామస్వామి అరగంట సేపు అనర్గళంగా మాట్లాడారు. కార్పొరేట్ మనీని స్వీకరించడాన్ని నిక్కీ హేలీ సమర్థించారు.
అదేవిధంగా డోనార్స్ మీద ఆధారపడడం సరికాదు అని హేలీ వ్యాఖ్యలను వివేక్ కొట్టిపారేశారు. ప్రత్యర్థులు అటాక్ చేయకుండా చూసుకున్నారు. రాన్ డీసాంటిస్‌తో పాటు వివేక్ మధ్య చర్చ భీకరంగా జరిగింది. ఎంత సేపు మాట్లాడావన్న విషయంతోపాటు ఎలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేశావన్న అంశం ముఖ్యమైదిగా ఉంటుంది.
మరోవైపు, ఉక్రెయిన్ వార్‌పై రామస్వామి మాట మార్చడాన్ని క్రిస్ క్రిస్టీ తప్పుపట్టారు. గాజాకు అమెరికా దళాలను ఎందుకు పంపారన్న అంశంపై క్రిస్ క్రిస్టీ ప్రశ్నించారు. గత మూడు చర్చల తరహాలోనే ఈసారి కూడా ట్రంప్‌ను క్రిస్టీ నిలదీశారు.