Telugu News » Vizag Drug Case: కంటెయినర్‌లో ఉన్నదంతా మాదకద్రవ్యాలే.. సీబీఐ తాజా నివేదిక..!

Vizag Drug Case: కంటెయినర్‌లో ఉన్నదంతా మాదకద్రవ్యాలే.. సీబీఐ తాజా నివేదిక..!

సంధ్య ఆక్వా(Dusk Aqua) చిరునామాతో బ్రెజిల్‌(Brazil) నుంచి విశాఖ(Vizag) చేరిన ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’(Inactive dry yeast) నుంచి 49 నమూనాల్ని పరీక్షించింది.

by Mano
Vizag Drug Case: All that is in the container are drugs.. CBI latest report..!

ఏపీ(AP)లో పెను ప్రకంపనలు రేపుతున్న మాదకద్రవ్యాల వ్యవహారంపై పూర్తి వివరాలను సీబీఐ(CBI) ఎఫ్‌ఐఆర్‌(FIR)తో పాటు ఓ నివేదికను పొందుపరిచింది. సంధ్య ఆక్వా(Dusk Aqua) చిరునామాతో బ్రెజిల్‌(Brazil) నుంచి విశాఖ(Vizag) చేరిన ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’(Inactive dry yeast) నుంచి 49 నమూనాల్ని పరీక్షించింది.

Vizag Drug Case: All that is in the container are drugs.. CBI latest report..!

అందులో 48 నమూనాల్లో కొకైన్, మెథక్వలోన్‌ వంటి మాదక ద్రవ్యాలున్నట్లు తేల్చింది. మొత్తంగా 25వేల కిలోల ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’ లోనూ మత్తు పదార్థాల ఉనికి ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఏ పరిమాణంలో ఉన్నాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కనీసం 20 శాతం మేర మాదకద్రవ్యాలు కలగలిపి ఉంటాయకున్నప్పటికీ ఇంత పెద్దమొత్తంలో చిక్కడం దేశంలోనే ఇదే తొలిసారి.

ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించేందుకు సీబీఐ 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌ కొనసాగించింది. బ్రెజిల్‌ నుంచి విశాఖకు వస్తున్న కంటైనర్‌లో భారీగా మత్తు పదార్థాలు తరలుతున్నట్లు ఈనెల 18న ఇంటర్‌పోల్‌ నుంచి ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి మెయిల్‌ అందింది. ఈ నిమిషాల వ్యవధిలోనే సీబీఐ ఎస్పీ గౌరవ్‌మిట్టల్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ చేపట్టి మత్తు పదార్థాలను పట్టుకుంది.

బ్రెజిల్‌ నుంచి వచ్చిన ‘ఇన్‌ యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌’లో మాదకద్రవ్యాలున్నట్లు తేలటంతో సీబీఐ అధికారులు అక్కడే ఉన్న సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి గంగాధర్‌ను ప్రశ్నించారు. అయితే సీబీఐ అధికారుల ప్రశ్నలకు వారు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మొత్తానికి కంటైనర్‌లో ఉన్న ప్యాకెట్లను పరీక్షించి మత్తు పదార్థాలుగా గుర్తించింది. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మరికొందరు వ్యక్తులపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసింది సీబీఐ.

You may also like

Leave a Comment