రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ (Polling) ప్రారంభమైంది. ఓటర్లు (Voters) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. మెదక్ జిల్లా ఎల్లాపూర్, కరీంనగర్ 371 బూత్‌లో ఈవీఎంలు పని చేయలేదు.
అటు సూర్యాపేట బూత్ నెంబర్ 89, బాసర 262 బూత్ ఈవీఎంలు సతాయించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కాస్త ఆల్యం అవుతోంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 87 వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించాయి. దీంతో ఈవీఎంలను సరి చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది.
జగిత్యాల జిల్లాలో పొలింగ్ కొనసాగుతోంది. ధర్మపురిలో ఈవీఎం మొరాయించింది. ఈవీఎంలను సరి చేయడంలో ఆలస్యం అయింది. దీంతో ఓటింగ్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల హైదర్ షాకోట్ ప్రభుత్వ పాఠశాలలో బూత్ నెంబర్ 89లో ఈవీఎం పనిచేయలేదు. దీంతో ఓటింగ్ ప్రారంభం కాలేదు.
అటు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో రెండూ పోలింగ్ కేంద్రాల్లో, తాళ్లపేట 1 పోలింగ్ బూత్ వద్ద మాకులపేట్ 5 పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించాయి. మహబూబాబాద్ జిల్లాబయ్యారం హైస్కూల్ లో 33 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. 45 నిమిషాలు దాటిన విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.