అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో నేతల మాటలు కోటలు దాటుతున్నాయని అనుకుంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు నోటికి పనిచెబుతుంటే.. అనుచరగణం చేతులకు పని చెప్పడం కనిపిస్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా కొడంగల్ (Kodangal)లో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య వార్ మొదలవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఉప్పల్ (Uppal)కు చెందిన బీఆర్ఎస్ నేత సోమశేఖర్ రెడ్డి 100 మంది అనుచరులతో కలిసి కోస్గి మండల పరిధిలోని సర్జఖాన్ పేట్ గ్రామంలో కాంగ్రెస్ నేతలపై దాడికి దిగినట్టు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విషయం తెలుసుకుని సర్జఖాన్ పేట గ్రామానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలిరావడంతో వారిని చూసిన సోమశేఖర్ రెడ్డి, అతని అనుచరులు పారిపోయారని తెలుస్తుంది.
ఇక ఎన్నికలకు సమయం అతి తక్కువ ఉండటంతో ముఖ్య నేతలంతా ప్రచారంలో నిమగ్నం అయ్యారు.. ఎన్నికలు అయ్యే వరకు విమర్శలు చేసుకుంటున్న నేతలు అనంతరం ఎవరి దారి వారు చూసుకుంటారని తెలిసిందే.. మరి కార్యకర్తలు మధ్యలో ఎందుకు తన్నుకు చావడం అని ఇప్పటి రాజకీయ పరిస్థితులను అవగతం చేసుకున్న వారు అనుకుంటున్నారు.