నేటి సమాజంలో అడుగడుగునా కామాంధులు తారాసపడుతున్నారు.. ఈ యాంత్రిక యుగంలో మానవ సంబంధాల విలువలు మంటగలిసి పోతున్నాయి.. పసిమొగ్గలపై పశువాంఛ తీర్చుకొంటూ.. అభం శుభం తెలియని బాలికలే లక్ష్యంగా.. మేలి ముసుగున కామాంధులు రెచ్చిపోతున్నారు. అడుగడుగునా కామాంధులు నిండిన సమాజంలో.. కేవలం మాంసపు ముద్దగా చూసే కొందరు ఆగంతకుల మధ్య ఒక ఆడపిల్ల బ్రతుకు భారంగా మారుతుందని నేటి సమాజ పరిస్థితులను చూస్తున్న కాలం ఘోషిస్తుంది..
ఇక మదమెక్కిన ఓ మానవ మృగం చాక్లెట్స్ ఇస్తానంటూ ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది కాదు.. బంజారాహిల్స్ (Banjara Hills) అని గొప్పగా చెప్పుకొంటున్న ప్రాంతంలో జరిగిన ఘటన.. బంజారాహిల్స్ పోలీసుల (Police) కథనం ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసముంటున్న బాలిక (7) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నది.
దసరా (Dussehra) సెలవులు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నది.. ఆ బాలిక పై కన్నేసిన నిందితుడు.. సమీపంలో పనిచేస్తున్న వాచ్‌మన్ (Watchman) మనోహర్.. వీధిలో ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్స్ ఇస్తానంటూ తన గదిలోకి తీసుకువెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన ఆ చిన్నది జరిగిన ఘోరాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో వాచ్‌మన్‌ను నిలదీయగా.. తనకు ఏం తెలియదని బుకాయించాడు.
ఇంటి యజమాని సైతం తన వాచ్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని, కావాలంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ దబాయించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలిక తల్లిదండ్రులు సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..