ఏపీ (AP), తెలంగాణ (Telangana) మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం (Krishna Waters Dispute) రాజుకొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకి పరిష్కారం లేకుండా తరచుగా ఈ అంశంపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం ఆందోళనకరంగా మారింది.

మరోవైపు సుల్తానియా అధికారుల ద్వారా టెయిల్ పాండ్ లోని నీటిని ఏపీకి తరలించడంపై వివరాలు సేకరించారు. అందులో నీటి వినియోగంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. కాగా కేఆర్ఎంబీకి ఏపీ తీరుపై తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత వారం క్రితం కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలుకు ఏపీ సర్కారు గడువు కోరిన సంగతి తెలిసిందే..
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జూన్ వరకు ఏపీ గడువు కోరగా.. ఏపీ రిక్వెస్ట్ పై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. దీంతో జూన్ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని ట్రైబ్యునల్ తెలిపింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. విచారణను మే15కు కృష్ణా ట్రైబ్యునల్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.. .