బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు తెలంగాణ(Telangana)లోని పలుచోట్ల వర్షాలు(Rains) పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటనలో పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. నగరంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు, గాలిలో తేమ 41శాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంగళవారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పంట పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.