Telugu News » Web Domains: ఇండియా Vs భారత్ వివాదంతో చాలా వెబ్ సైట్లు ఎందుకు భయపుతున్నాయి?

Web Domains: ఇండియా Vs భారత్ వివాదంతో చాలా వెబ్ సైట్లు ఎందుకు భయపుతున్నాయి?

నాన్ రిస్ట్రిక్టెడ్ డొమైన్స్ అంటే వీటిని ఎవరైనా కొనుక్కొవచ్చు. ముఖ్యంగా .com, .in వంటివి. ఇవి జనరల్ డొమైన్స్ గా పిలుస్తుంటారు. .com అంటే వ్యాపారానికి సంబంధించినదని, .in అంటే ఇండియాలో ఉండే వెబ్ బైట్ అని అర్థం.

by Prasanna
domains 3

వెబ్ ప్రపంచంలో TLDs అంటే టాప్ లెవెల్ డొమైన్స్ (Domains) కి చాలా ప్రాధాన్యత ఉంది. అవి మనందరికి తెలిసిన .com, .in, .org, .edu, .gov వంటివి. అయితే ఇప్పడు వీటిలో .in డొమైన్ కు పెద్ద సమస్య రానుంది.  ఇది ఇండియా (India) పేరును భారత్ (Bharat) మారిస్తే వచ్చే సమస్య. ఇండియా పేరు మారితే ఈ వెబ్ సైట్ (Website) కు ఏమవుతుందని అనుకుంటున్నారా…?

domains 3

అది తెలుసుకోవాలంటే ముందుగా దీనికి సంబంధించిన ప్రాధమిక అవగాహన కోసం ఈ విషయాలు తెలుసుకుందాం.

మనకు సాధారణంగా రిస్ట్రిక్టెడ్ డొమైన్స్, నాన్ రిస్ట్రిక్టెడ్ డొమైన్స్ ఉంటాయి. రిస్ట్రిక్టెడ్ డొమెన్స్ లో .gov, .edu వంటివి ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన అంశాలకు సంబంధించినవై ఉంటాయి. .gov అంటే ప్రభుత్వ అంశాలకు సంబంధించి, .edu అంటే విద్యాసంస్థలు వంటివి తీసుకుంటాయి. ఇటువంటివి అయా అవసరాల మేరకే తీసుకుంటారు.

domains 4

నాన్ రిస్ట్రిక్టెడ్ డొమైన్స్ అంటే వీటిని ఎవరైనా కొనుక్కొవచ్చు. ముఖ్యంగా .com, .in వంటివి. ఇవి జనరల్ డొమైన్స్ గా పిలుస్తుంటారు. .com అంటే వ్యాపారానికి సంబంధించినదని, .in అంటే ఇండియాలో ఉండే వెబ్ బైట్ అని అర్థం. అంటే ఇండియాకు సంబంధించిన అంశాలు, ఇతర వ్యాపారాలు, మరేదైనా అంశాలకు సంబంధించినవే సాధారణంగా ఉంటాయి.

ఇప్పుడు ఇండియా పేరు మార్పుతో మిగతా డొమైన్ల పరిస్థితి ఎలా ఉన్నా, .in డొమైన్ ఉపయోగించే వెబ్ సైట్లకు మాత్రం ఇబ్బందులు తప్పదు. .in డొమైన్ తో దేశంలో వేలాది వెబ్ సైట్లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటీ వరకు మన దేశాన్ని ఇండియా పేరతో పిలుస్తున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు .in డొమైన్లు కలిగిన వెబ్ సైట్లకు. కానీ ఇప్పుడు భారత్ అని మారితే అప్పుడు ఆ వెబ్ సైట్లు కూడా ఇండియా నుంచి నిర్వహించబడుతున్నాయనే విషయాన్ని తెలియచేస్తూ, వాటి ఐడెంటీని కాపాడుకోవాలంటే వాటి డొమైన్లను .bh అనో, .br అనో మార్చుకోవాలి. అంటే కొత్త టీఎల్ డీను ఏర్పాటు చేసుకోవాలి.

domains 2

.in అంటే ఇండియా అని ఇప్పటీ వరకు ఓకే. ఒక వేళ పేరు మారితే కాలక్రమంలో .in అనే డొమైన్ కు విలువ లేకుండా పోతుంది. అప్పుడు ఆ వెబ్ సైట్లు కూడా ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి పేరును ముందుగా అనుకున్నట్లు .bh, .br, .bt అని మార్చుకోవాలి. ఇక్కడొ ఇబ్బంది ఉంది. అదేంటంటే…ఇప్పటికే .bh ను బహ్రెయిన్, .br బ్రెజిల్, .bt ని భూటాన్ దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. అంటే ఇవి ఆయా దేశాలను రిప్రజెంట్ చేస్తున్నాయి. కాబట్టి వీటిని తీసుకునే అవకాశం భారత్ కు ఉండకపోవచ్చు.

domains

అయితే డొమైన్లు అనేవి మనకు అనుకూలంగా అయా వెబ్ సైట్లను రూపొందించుకోడానికి, వ్యూయర్స్ కు బాగా గుర్తుండే విధంగా ఆ పేర్లను తీసుకుంటామని, డొమైన్ల విషయంలో కూడా అదే జరుగుతుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు భారత్ గా పేరు మారితే మన దేశానికి సంబంధించిన పేరుగా .bharat, .bhr, .brt, .bhrath ఇలా డిఫరెంట్ కాంబినేషనల్లో రూపొందించుకోవచ్చు. మరొ వైపు ఇబ్బంది లేకపోతే పాత డొమైన్లను కొనసాగించుకోవచ్చునని కూడా చెప్తున్నారు.

సస్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న వెబ్ సైట్ల విషయంలో డొమైన్ మారితే చాలా సార్లు మళ్లీ అంత సక్సెస్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు కూడా అని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You may also like

Leave a Comment