భారత మాజీ టెన్నిస్ సూపర్ స్టార్(Indian Tennis Super Star) సానియా మీర్జా (Saniya Mirza) వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పవిత్ర రంజాన్ (Ramzan Festiwal) మాసంలో ఆమె వ్యవహరించిన తీరుపై ముస్లిం మతపెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్‌లో నిర్వహించిన ఒక ఎక్స్పో ఏర్పాటుచేశారు.
దీనికి సానియా తన చెల్లెలు అనం మీర్జాతో కలిసి దావత్ ఎ రంజాన్‌కు హాజరయ్యారు. వీరితో పాటే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్, మునావర్ ఫారుఖీ సైతం హాజరయ్యాడు. అయితే, పవిత్ర రంజాన్ మాసంలో సినిమా వ్యక్తులను పిలువడం ఏంటని ముస్లిం మతపెద్దలు ఫైర్ అయ్యారు.
పవిత్ర రంజాన్ పండుగను డబ్బుల సంపాదనకు వేదికగా మారుస్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మెహిఫిల్ ఎ ఖైజా ఎక్స్ పోలో మునావర్ ఫారుఖీ చీఫ్ గెస్ట్ పాల్గొనడంపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ముస్లిం స్కాలర్ ఇలియాజ్ శంసీ మాట్లాడుతూ..సానియా ఇలాంటి విషయాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు.
సానియా మంచిని కోరేవాడిగా చెబుతున్నా.. వారింట్లో విడాకుల గొడవ జరిగి తక్కువ రోజులే అవుతోంది. డబ్బుల కోసం ఇలాంటి వాటికి రాకూడదు. రవీనా టండన్ లాంటి వారొచ్చి రంజాన్ పవిత్రతను దెబ్బతీయొద్దన్నారు.
మరో ముస్లిం స్కాలర్ మహ్మద్ సలీం మాట్లాడుతూ.. మునావర్ ఫారుఖీ గతంలో హైదరాబాద్ వచ్చి హిందూ దేవుళ్లను కించపరిచడంతో ఎంత పెద్ద వివాదం చెలరేగిందో అందరికీ తెలుసు. మునావర్ లాంటి వారి వల్ల ముస్లింలకు చాలా తీవ్ర ఇబ్బందులు కలిగాయన్నారు. వీరిని ఇక్కడకు పిలిపించిన వ్యక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.