Telugu News » NOTA : నోటాకు మెజార్టీ వస్తే ఏం చేస్తరు.. ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్న?

NOTA : నోటాకు మెజార్టీ వస్తే ఏం చేస్తరు.. ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్న?

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సుప్రీంకోర్టు(Supream Court)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం(petition) ఒకటి దాఖలైంది. ఎన్నికల్లో నోటా(NOTA)కు అధికంగా ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి? ఎటువంటి చర్యలు తీసుకుంటారని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడంతో పాటు నోటీసులు కూడా జారీచేసింది.

by Sai
What will be done if Nota gets majority.. Supreme Court question for EC?

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేసి తిరిగి కొత్తగా పోలింగ్ చేపట్టాలని శివ్ ఖేరా అనే రచయిత ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆయన ఈ పిటిషన్‌లో వేసిన అంశాలను సీజేఐ(CJI) ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను మరో ఐదేళ్ల పాటు ఏ నియోజకవర్గంలోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని సుప్రీంలో వేసిన ఆ పిటీషన్‌లో శివ్ ఖేరా కోరారు.పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు.

ఇటీవల సూరత్‌‌లో పోలింగ్ లేకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ఉదహరించారు. పోటీలో ఓకే అభ్యర్థి ఉన్నందున పోలింగ్ నిర్వహించకుండా అభ్యర్థిని ఏకగ్రీవం జరిగినట్లు కోర్టులో వాదనలు జరిగాయి.

ఈ ప్రకారంగానే నోటాకు మెజార్టీ వస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలపాలని సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులిచ్చింది. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేయకుండా నోటా తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తున్నారు. కాగా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన పిల్‌తో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవీఎలంలో నోటా ఆప్షన్ కల్పించారు.

You may also like

Leave a Comment