Telugu News » Indian Air Force : కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా విమానం.. ఎక్కడంటే?

Indian Air Force : కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిఘా విమానం.. ఎక్కడంటే?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు(Indian Air Force) చెందిన ఓ నిఘా విమానం (SPY PLANE CRASH) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. గురువారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

by Sai
Where is the crashed Indian Air Force surveillance plane?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు(Indian Air Force) చెందిన ఓ నిఘా విమానం (SPY PLANE CRASH) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. గురువారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అయితే, ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఉన్నతాధికారులు వచ్చి ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Where is the crashed Indian Air Force surveillance plane?

అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా ప్రకటించింది. గురువారం ఉదయం రెగ్యులర్ విధుల్లో భాగంగా ఎగిరిన నిఘా విమానం అనుకోకుండా కంట్రోల్ తప్పిపోయి కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

జైసల్మేర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధని జాజియా గ్రామంలో ఓ బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయింది. ప్రమాదానికి ముందే పైలెట్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు లోకల్ పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విమానం భారతీయ వాయుసేన నిఘా, గూఢచారి కార్యకాలాపాలు నిర్వహించేందుకు వినియోగిస్తున్నట్లు తెలిసింది.కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేసినట్లు వాయుసేన ప్రకటించింది.

You may also like

Leave a Comment