Telugu News » WHO: ఆల్కహాల్, ఈ-సిగరెట్ మత్తులో యువత.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో…!

WHO: ఆల్కహాల్, ఈ-సిగరెట్ మత్తులో యువత.. ఆందోళనలో డబ్ల్యూహెచ్‌వో…!

తరుణంలో డబ్ల్యూహెచ్‌వో(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ కీలకమైన డేటాను విడుదల చేసింది. కౌమార దశలో ఉన్న వారు ఆల్కహాల్((Alcohol), ఈ-సిగరెట్‌ల(e-cigarettes)ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

by Mano
WHO: Alcohol, e-cigarette intoxication youth.. WHO is worried...!

ఆధునిక కాలంలో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. సరదా కోసం సిగరేట్ కాల్చడం, మాదకద్రవ్యాల వాడకం, మద్యపానం ఇవన్నీ హాబీగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో డబ్ల్యూహెచ్‌వో(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ కీలకమైన డేటాను విడుదల చేసింది. కౌమార దశలో ఉన్న వారు ఆల్కహాల్((Alcohol), ఈ-సిగరెట్‌ల(e-cigarettes)ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొంది.

WHO: Alcohol, e-cigarette intoxication youth.. WHO is worried...!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయస్సు గల 2,80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని నివేదికలో పేర్కొంది. పోకడల వల్ల యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవిస్తున్నారని, ఇక, అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59 శాతంగా ఉందని నివేదికలో పేర్కొంది. ప్రస్తుత వినియోగం విషయానికి వస్తే గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా తాగుతునట్లు వెల్లడైంది. 5 శాతం మంది బాలికలతో పోలిస్తే, 11 ఏళ్ల అబ్బాయిలలో ఎనిమిది శాతం మంది అలా చేసినట్లు నివేదించారు.

కానీ, 15 సంవత్సరాల వయస్సులోని 38 శాతం మంది అమ్మాయిలు గత 30రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు డబ్ల్యూహెచ్ చెప్పుకొచ్చింది. చిన్న వయస్సులోనే ఈలాంటి వ్యసనాలకు అలవాటు పడటం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. గంజాయి వినియోగం 15 ఏళ్ల వయస్సుకు చెందిన 12 శాతం మంది ఉన్నట్లు హెచ్‌డబ్ల్యూవో పేర్కొంది. దీని వల్ల మద్యం నుంచి కలిగే హానితో పిల్లలు, యువకులను రక్షించడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని యూరప్, మధ్య ఆసియాలోని అనేక దేశాలకు సూచనలు చేసింది.

You may also like

Leave a Comment