పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాలకు కీలక సూచనలు చేసింది. కొవిడ్-19 కొత్త వేరియంట్ JN.1, ఇన్ల్ఫుయెంజాతో సహాతో శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తం చేసింది. కొత్త వేరియెంట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరింది.
డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ మాట్లాడుతూ.. COVID-19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశవిదేశాలకు వ్యాపించి స్వరూపాన్ని మార్చుకుంటోందని తెలిపారు. అయితే కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్‌తో పెద్ద ప్రమాదమేమీ లేదని తెలిపారు. ఈ వైరస్‌ల పరిణామాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
దీని కోసం దేశాలు పర్యవేక్షణ, సీక్వెన్సింగ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డేటా షేరింగ్‌ను నిర్ధారించాలన్నారు. ఇటీవల అనేక దేశాల్లో JN.1 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. అయినప్పటికీ JN.1 ద్వారా ఎదురయ్యే అదనపు ప్రజారోగ్య ప్రమాదం తక్కువగాగా ఉన్నట్లు డాక్టర్లు అంచనా వేస్తున్నారు.
ఇతర వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందని అందువల్లే ఈ వేరియంట్ వేగంగా వ్యప్తి చెందుతోందని తెలిపారు. అదేవిధంగా వీలైనంత వరకు ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.