Telugu News » Gadwal MLA: గద్వాల్ ఎమ్మేల్యే ఎవరు? సుప్రీం కోర్టు ఏం చెప్పనుంది…

Gadwal MLA: గద్వాల్ ఎమ్మేల్యే ఎవరు? సుప్రీం కోర్టు ఏం చెప్పనుంది…

గద్వాల్ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గద్వాల్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

by Prasanna
Gadwal MLA

బీఆర్ఎస్ గద్వాల్ ఎమ్మేల్యే (Gadwal MLA) కృష్ణమెహన్ రెడ్డి  పై తెలంగాణా హైకోర్టు (High Court) ఇచ్చిన అనర్హత తీర్పుపై ఆయన సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. ఈ కేసు నేడు (సోమవారం) సుప్రీంలో విచారణ జరగనుంది.

Gadwal MLA

అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాదనలు వినకుండా అనర్హత వేటు వేసిందని కృష్ణమెహన్ రెడ్డి చెప్తూ… సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అలాగే గద్వాల్ నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని, రానున్న ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గద్వాల్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై  డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు.  ఎన్నికల అఫిడవిట్‌లో కృష్ణమోహన్‌ రెడ్డి కొన్ని అంశాలను చూపలేదని, ఈ విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారని ఆమె తెలిపారు. విచారణ అనంతరం హైకోర్టు కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసి డీకే అరుణని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది.

డీకే అరుణను ఎమ్మెల్యేగా హైకోర్టు గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదని డీకే అరుణ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని తేల్చింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.

ఈ విషయంపై డీకే అరుణ తెలంగాణా స్పీకరుని కలిసి తనను ఎమ్మేల్యేగా గుర్తిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరేందుకు ప్రయత్నించగా…స్పీకర్ డీకే అరుణకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ సుప్రీంలో కృష్ణమెహన్ రెడ్డి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన కేసులో విచారణ జరగనుంది.

You may also like

Leave a Comment