Telugu News » Shyamji Krishna Varma: వలస పాలకుల గడ్డపై నుంచే పోరాటాలు చేసిన గొప్ప యోధుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ….!

Shyamji Krishna Varma: వలస పాలకుల గడ్డపై నుంచే పోరాటాలు చేసిన గొప్ప యోధుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ….!

వలస పాలకుల గడ్డపై నుంచే విప్లవ కార్యకలపాలు నిర్వహించిన పోరాట యోధుడు. ఇండియన్ హౌస్, ఇండియన్ సోషియాలజిస్టు సంస్థల ద్వారా లండన్‌లో భారత విద్యార్థులకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి.

by Ramu

శ్యామ్ జీ కృష్ణ వర్మ (Shyamji Krishna Varma)… కాశీ పండిట్‌ల నుంచి ప్రతిష్టాత్మక ‘పండిట్’ (Pandit)బిరుదును పొందిన మొదటి బ్రహ్మణేతర వ్యక్తి. వలస పాలకుల గడ్డపై నుంచే విప్లవ కార్యకలపాలు నిర్వహించిన పోరాట యోధుడు. ఇండియన్ హౌస్, ఇండియన్ సోషియాలజిస్టు సంస్థల ద్వారా లండన్‌లో భారత విద్యార్థులకు సహాయం చేసిన గొప్ప వ్యక్తి. భరత మాతకు దాస్య విముక్తి కలిగిన తర్వాతే తన అస్తికలను భారత్‌కు పంపాలని కోరుకున్న గొప్ప దేశ భక్తుడు.

1857లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో శ్యామ్ జీ కృష్ణ వర్మ జన్మించారు. 11 ఏండ్ల వయసులోనే తల్లి మరణించడంతో అమ్మమ్మ దగ్గర పెరిగారు. భుజ్‌లో సెకండరీ ఎడ్యుకేషన్, ముంబైలో ఉన్నత విద్యత పూర్తి చేశారు. అనంతరం సంస్కృతంపై మక్కువతో ఆ భాషను నేర్చుకున్నారు. 1877లో కాశీ పండిట్ ల నుంచి ‘పండిట్’అనే బిరుదు పొందారు.

అనంతరం ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం నుంచి న్యాయవాదిగా పట్టా అందుకున్నారు. 1885లో స్వదేశం తిరిగి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. తర్వాత మళ్లీ లండన్ వెళ్లారు. ఆ సమయంలోనే ఇండియా హౌస్, ది ఇండియన్ సోషియాలజిస్ట్‌ లను నెలకొల్పాడు. వీర సావర్కర్, మేడం బికాజీ కామ, లాలా హర్ దయాళ్, మదన్ లాల్ డింగ్రా లాంటి వారు ఆ సంస్థల్లో చేరారు. క్రమక్రమంగా ఆ సంస్థలు జాతీయోద్యమానికి వేదికగా మారాయి.

ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించి దేశానికి స్వాతంత్ర్య ఆశ్యకత గురించి వివిధ దేశాల్లో ప్రచారం చేశారు. దీంతో ఆయనపై బ్రిటీష్ పాలకులు కన్నెర్ర జేశారు. యూరప్ లోని కోర్టుల్లో ఆయనను న్యాయవాదిగా వాదించేందుకు అనుమతించలేదు. తర్వాత ఆయన ఫ్రాన్సుకు వెళ్లిపోయారు. 30 మార్చి 1930న అనారోగ్య కారణాలతో స్విట్జర్ లాండ్‌లో కన్ను మూశారు.

శ్యామ్ జీ తన మరణానికి ముందు,తనతో పాటు తన భార్య చితాభస్మాన్ని జెనీవాలోని సెయింట్ జార్జ్ శ్మశాన వాటికలో భద్రపరిచేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. స్వేచ్ఛా భారత్ వచ్చాకే తన అస్తికలను భారత్ కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత ఆయన అస్తికలు అక్కడే ఉండిపోయాయి. 22 అగస్టు 2003లో ప్రధాని మోడీ కృషితో శ్యామ్ జీ అస్తికలు భారత్ చేరుకున్నాయి.

You may also like

Leave a Comment