Telugu News » ఆర్జీవీకి చంద్రబాబు అంటే ఎందుకు ఇష్టం ఉండదు..? కారణం ఏమిటి అంటే..?

ఆర్జీవీకి చంద్రబాబు అంటే ఎందుకు ఇష్టం ఉండదు..? కారణం ఏమిటి అంటే..?

by Sravya

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వర్మ. ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు వర్మ. ఈ మధ్యన అయితే ఆయన ఏపీ రాజకీయాలు మీద ఫోకస్ పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలపై గతంలో లక్ష్మి ఎన్టీఆర్ సినిమా తీసిన ఆర్జీవి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వ్యూహం, శపథం వంటి సినిమాలను తీస్తున్నారు.

విడుదల కి సినిమా రెడీగా ఉంది. అయితే చంద్రబాబు అంటే ఆర్జీవికి ఎందుకు పగ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చేసారు. వయిస్రాయ్ హోటల్ ఘటన జరిగినప్పటి నుండి చంద్రబాబు అంటే తనకి పగ అట. చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారని, టీడీపీ ని లాక్కున్నారని అప్పటినుండి చంద్రబాబు అంటే ఆర్జీవికి నచ్చదని చెప్పుకొచ్చారు.

Also read:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన వ్యూహం సినిమాలో ప్రజలకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబుకి సంబంధించి బండారమంతా కూడా సినిమాలో బయట పెట్టేసారట. ఏం చేసినా వ్యూహం సినిమా రిలీజ్ అయి తీరుతుందని ఆయన తేల్చి చెప్పారు. సీఎం జగన్ కి మద్దతు ఇస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ పోస్టులు ఆయన టార్గెట్ చేసే విధానం హాట్ టాపిక్ అయిపోయింది. ఆయనకి రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment