Telugu News » Wild Elephant Attack: పర్యాటకులను వెంబడించిన ఏనుగు.. వీడియో వైరల్..!!

Wild Elephant Attack: పర్యాటకులను వెంబడించిన ఏనుగు.. వీడియో వైరల్..!!

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(UP)లోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది. లఖింపుర్ భేరిలోని దుధ్వా టైగర్ రిజర్వును సందర్శించడానికి కొంతమంది పర్యటకులు సఫారీ కారు(జిప్సీకారు)లో వెళ్లారు.

by Mano
Wild Elephant Attack: Elephant chasing tourists.. Video goes viral..!!

పర్యాటకులను(Tourists) ఓ ఏనుగు(Elephant) హడలెత్తించింది. ఆ సమయంలో కొంతమంది పర్యటకులు సఫారీ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, టూరిస్ట్ గైడ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(UP)లోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంది.

Wild Elephant Attack: Elephant chasing tourists.. Video goes viral..!!

లఖింపుర్ భేరిలోని దుధ్వా టైగర్ రిజర్వును సందర్శించడానికి కొంతమంది పర్యటకులు సఫారీ కారు(జిప్సీకారు)లో వెళ్లారు. కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ వారికి ఓ ఏనుగుల గుంపు కనిపించింది. ఆ పర్యటకుల్లో కొంతమంది గజరాజుల ఫొటోలను తీసేందుకు కారులోంచి కిందికి దిగారు.

ఆ సమయంలో ఏనుగుల గుంపులో ఓ గజరాజుకు చిర్రెత్తుకొచ్చి పర్యటకులను వెంబడించింది. ఈ క్రమంలో జంగిల్ సఫారీ డ్రైవర్, గైడ్ అప్రమత్తతో టూరిస్టులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన కొందరు వన్యప్రాణి ప్రేమికులు ఘాటుగా స్పందించారు. అడవి జంతువులకు రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించరాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ‘ఎక్కడికెళ్లినా అతి అంత మంచిది కాదని.. తిక్క కుదిరింది..’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

You may also like

Leave a Comment